*రచయిత " హరినాథ్ "
*వ్రాసినవారు. " హరినాథ్ "
*నివసించే స్థలము " తెలంగాణ , బెల్లంపల్లి"
నోరూరించే అవకాయ పచ్చడి పోరుగురి ముచ్చట / తెలుగు నీతి కథ /Telugu stories
చదివి ఆనందించండి.*
నేను నా స్నేహితుడు మా ఇంట్లో కూర్చుని మావిడి పండు ముక్కలు తింటున్నాం. ఫ్రీగా వచ్చినవి కనుక మా స్నేహితుడు ఎక్కువ తింటు ఎంజాయ్ చేస్తున్నాడు.
స్నేసితుడు : మాటల్లో అడిగాడు *"ఆవకాయ మా ఇంట్లో జనవరి టైమ్ కి అయిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుందంటావ్! ఎన్ని కాయలు పెడతార్రా మీ ఇంట్లో?"
*"ఓ నాలుగు."*
*"వందలా?"*
*"కాదు నాలుగు కాయలు"* అంటూ పెద్దముక్క అందుకున్నాడు.
నేను షాక్.
*"నాలుగు కాయలు ఏడాదికి ఎలా సరిపోతాయి? ఎలారా ఎలా?"*
అప్రయత్నంగా, ఆశ్చర్యంగా, ఆత్రంగా అడిగాను.
*"ఆవకాయ పెట్టె ఆడవాళ్ళలో ఓ గొప్ప గుణం ఉంటుంది. 'మీరు ఆవకాయ అద్భుతంగా పెడతారు. మీ చేతి మహిమ అండీ! ఆ చేతికి, మా చేతులు ఎత్తి దణ్ణం పెట్టచ్చు. ఎప్పుడో మా అమ్మ నా చిన్నప్పుడు పెట్టేది. మళ్ళీ అంత రుచిగా ఇప్పుడే అండీ తినటం. మా ఆవిడ ఎంత చచ్చి చెడి పెట్టినా ఈ రుచి రాదండీ 'అని కాసేపు పొగిడావ్ అనుకో, తెగ సంబరపడి పోయి 'ఎదో నాకు చేతనయైనట్టు పెట్టానండి. వుండండి కాస్త ఇస్తా, రుచి చూద్దురు గానీ"అనేసి ఓ సీసాలో పెట్టి ఇస్తారు. ఇంచు మించు ఈ స్కీం నేను తెలిసిన అందరి ఇళ్లలోనూ ఆవకాయ సీజన్లో అమలు జరుపుతా. ఓ యాభై, అరవై సీసాల అన్ని రకాల ఊరగాయలు పొగవతాయి."*
బ్రహ్మ రహస్యం చెప్పి మావిడి టెంక అందుకున్నాడు.
*"అమ్మ వెధవా, గొప్ప టెక్నిక్ ఉందిరా నీ దగ్గర"* కాస్త జలసీగా అన్నాను.
నవ్వి ఇంకా ఈ విధం గా వెక్కిరిస్తూ వెళ్ళాడు.
*"ఆ లేడీస్ తో మనం ఇంకా వీలుంటే ఏమనాలి అంటే, చూడమ్మా ఆ సుబ్బారావు గారి ఇంట్లో ఊరగాయ ఇంత టేస్టు ఉండదు అని, సప్పా అప్పారావు గారి ఇంట్లో పాళ్ళు సరిగా కలపరు అని, మహాలక్ష్మి గారు కలిపే నూనె మంచిది కాదని, అసలు వాళ్ళ ఊరగాయ నక్క ఐతే మీ ఇంట్లోది నాగలోకం అని, ఆవకాయకి అవార్డు ఉంటె అది మీదే నండీ అని కూడా అన్నవనుకో; ఇంకో సీసాలో కాస్త మాగాయ, మెంతికాయ కూడా పెట్టి ఇవ్వచ్చు. ఈ సీజన్ లో వాళ్ల అందం గురించి కంటే వాళ్ళు పెట్టిన ఆవకాయ గురించి పొగడ్త వినాలని ఉంటుంది వాళ్లకి" అని టెంక నాకి ఇంకో ముక్క అందుకున్నాడు.*
ఈ జాకాల్ గాడుకి ఇన్ని తెలివి తేటలు దేవుడు ఎందుకు ఇచ్చాడా అని చింతించి కాస్త డౌట్ వచ్చి అన్నాను.
*"ఒరే కాస్త పొగిడితే అవకాయలు సీసాలకు సీసాలు ఇచ్చేస్తారు అంటే నమ్మలేక పోతున్నా! అంత వెర్రి మాలోకాలు ఎవరూ ఉండరు గాక వుండరు"* అనేసాను.
*"వుంటారురా వాళ్ళ టాలెంట్ ని పొగుడు తున్నామని సంబరపడే వాళ్ళు ప్రపంచంలో ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది తప్పకుండ."*
*"నోరుముయ్యరా తప్పకుండా లేదు మట్టికుండా లేదు. నువ్వు నాలుగు మాటలు చెపితే ఊరగాయలు పట్టుకెళ్లండి మహా ప్రభో అని ఇచ్చేస్తారా ఎవర్రా పద. ఆ వెర్రి మాలోకాలు ఎవరో చూపించు నాకు"* అని తిరగబడి వాడ్ని వెంట్రుకలా తీసి పారేసాను.
దాంతో నోరు మూసేసాడు దెబ్బకి.
సరిగ్గా అదే సమయంలో లోపలనించి మా ఆవిడ ఓ సీసా తో వస్తూ *"ఇదిగో అన్నయ్య గారు, ఉల్లి ఆవకాయ మొన్ననే పెట్టాను. మీకు ఇష్టం అంటారు కదా"* అంటూ ఇచ్చింది.
నేను పక్కనే పిడుగు పడ్డ జడ్డి వెధవలా బిగుసుకు పోయాను.
వాడు అంటున్నాడు *"నీ చేతి ఆవకాయ కాశీ అన్నపూర్ణ ప్రసాదం అంత గొప్పదమ్మా. ఏమి రుచి తల్లీ ఆ చేతి మహిమ"* అంటుంటే మా వెర్రి బాగులది *"మాగాయ ముక్కలు ఎండ బెట్టా. కలిపాక కాస్త పంపిస్తా అన్నయ్యగారు"* అనేసింది.
*"అలాగేనమ్మా. నీ చేతి అవకాయకి GI స్టేటస్ ఇచ్చి గవర్నమెంట్ గుర్తించాలమ్మ, వస్తానమ్మా."*
అని నావైపు నక్కలా ఓ కన్నింగ్ లుక్ ఇచ్చి, వంకర నవ్వుతో *"వస్తాన్రా"* అని చెయ్యి సోఫాకి తుడిచేసి కోడిని మింగిన కొండ చెలువలా తాపీగా పోయాడు.
*"నిన్న మీరు రావటానికి ఓ పావుగంట ముందు వచ్చాడు అన్నయ్యగారు. ఎమ్మా ఊరగాయలు పెడుతున్నావా అని కబుర్లు మొదలెట్టాడు. పాపం వాళ్లావిడకి అస్సలు పెట్టటం తేలిదుటండీ. ఆ సుబ్బారావుగారు, అప్పారావుగారు ఎవ్వరి ఇళ్ళల్లో కూడా ఆవకాయ రుచి పచి ఉండవుట. ఆ మహాలక్ష్మి ఇంట్లో నూనె"* తను చెప్పుకు పోతోంది ఈ అపర అన్నపూర్ణ.
*నేను నోట మాట లేనట్టు ఉండి పోయాను.
TG ANIMALS వారు మీకు గొప్ప అవకాశం అందజేస్తారు ఎంటి అంటే మీలో ఎవరికైనా ఆర్టికల్ రాసే వారు వుంటే మాకు తెలియజేయగలరు మా మెయిల్nemillaharinath@gmail.comharinathchinna143@gmail.com
మీకు ఇలాంటి వ్యాసాలు కావాలి అనుకుంటే మన వెబ్సైట్ లో చాలా విషయాలు రాస్తూ update చేస్తూ ఈ website నుంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు మీరు చేయాల్సిన పని ఎంటి అంటే మా website lo పైన push notifications వస్తాయి అక్కడ subscribe చేసుకుంటే మీకు మెయిల్ రూపం లో వస్తాయి మా సమాచారం అందులో కూడా క్లుప్తంగా గ వస్తుంది
0 కామెంట్‌లు
animals, panchatantra,funny stories in telugu